Keerthy Suresh : కీర్తి సురేష్.. చూడ చక్కని అందంతో పాటు ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకుల మనసులని గెలుచుకుంటుంది. ఈ అమ్మడు మహానటి సినిమాలో నటించి వంద సినిమాల మైలేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే మహానటి తర్వాత కీర్తి సురేష్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. అయితే కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి విషయాలతో కీర్తి సురేష్ వార్తలలో నిలుస్తుంది. అనిరుధ్‌తో ప్రేమాయణం నడిపిస్తుందని, శివ కార్తికేయన్‌తో డేటింగ్‌లో ఉందని ప్రచారం చేశారు.
ఇక ఇప్పుడు , ఓ యంగ్ బిజినెస్ మెన్ ని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. ఆ వ్యక్తి కీర్తి సురేష్ ప్యామిలీకి బాగా సుపరిచితం అయిన వ్యక్తే అని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై కీర్తి సురేష్ సన్నిహితులు స్పందిస్తూ అవన్నీ పుకార్లే అని అన్నారు. గతంలోను కీర్తి పెళ్లిపై ప్రచారం జరిగింది. ఇక టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ తన లైనప్ ను బిల్డప్ చేస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే తమిళంలో కీర్తి సురేష్ కు సంబంధించి రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. మరో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
సుధా కొంగర దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. ఇందులో తమిళ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక కీర్తి నటించిన తమిళ చిత్రాలు ‘సైరన్’, ‘మామన్నన్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్30 చిత్రంలో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అనివార్య కారణాలతో వదులుకుందని టాక్. కీర్తి నటించిన దసరా అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించనుంది.