Kannababu : స్కిల్ డవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుని సీఎం జగనే అక్రమంగా జైలుకు పంపించినట్లు టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. స్కిల్ డవలెప్‌మెంట్ స్కామ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసి రూ.371 కోట్లు అవినీతి జరిగిందని ఇందుకు బాధ్యులుగా ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసిందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖ లాయర్ ఏమీ చేయలేకపోయారన్నారు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదని అర్థమైందన్నారు.
ఇనాళ్ళు పెట్రేగిపోయిన చంద్రబాబు…తన పాపం పండటంతో ప్రస్తుతం జైలులో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏ ఇనిస్టిట్యూట్, ట్రైనింగ్ సెంటర్ లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు 371కోట్లు లాగేశారని ఆరోపించారు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదని…చంద్రబాబుకు అన్యాయం జరిగిందని ప్రజలు ఎవ్వరూ అనుకోవడం లేదని కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో వాళ్లు బాధపడడం లేదు. ఈ సింపతీ వలన వాళ్లు గెలుస్తారని వారు నమ్ముతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత ఉందా లేదో తెలియదా అని కన్నబాబు అన్నారు.
దీనిని రాజకీయ కక్ష అని చంద్రబాబు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ జనాలలోకి తిరుగుతామని అంటున్నారు. జగన్ గురించి చులకనగా బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇది సినిమా అంటుకున్నారేమో.. ఇది సినిమా కాదు. డైరెక్షన్ యాక్షన్ చెబితే డైలాగులు చెప్పడం, దానికి అందరు క్లాప్ కొట్టడం సినిమాలలో సాగింది. కాని ఇది రాజకీయం. మీరు చెప్పినట్టు ఉండదు. జగన్‌కే వార్నింగ్ ఇస్తాడా అని కన్నబాబు మండిపడ్డారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. చట్టం ముందు అందరు సమానులే అంటూ కన్నబాబు అన్నారు. కాగా, నేనున్నా.. నేనొస్తున్నా.. మీకోసం నేను నిలబడతా’ అంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ అభయం ఇచ్చారు. ‘ఇలాంటివి టీడీపీ ఎన్నో చూసింది.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. లక్షల కోట్ల అప్పులు చేశారు. పాలన అంటే ఇదేనా..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు బాలకృష్ణ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…