Kalki 2898AD : ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు క‌ల్కి టీంకి లీగ‌ల్ నోటీసులు.. కార‌ణం ఇదే..!

Kalki 2898AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా గత నెల జూన్ 27న రిలీజయి భారీ విజయం సాధించడం మ‌నం చూశాం. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన కల్కి సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. కల్కి సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది.700 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన్ కల్కి బాక్సాఫీస్ రికార్డులు దులిపేస్తోంది. సినిమా రిలీజై సుమారు నెల రోజులు కావొస్తున్నా కలెక్షన్ల ప్రభంజనం ఆగడం లేదు.

బరిలో పెద్ద సినిమాలేవీ కూడా లేకపోవడంతో ‘కల్కి 2898 AD’ సినిమాకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. కాగా ఈ సినిమాకు ప్రధానం కారణం మహా భారతం సీన్స్. చాలా మంది జనాలు ఈ సీన్ల కోసమే కల్కి సినిమాకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే సన్నివేశాల విషయమై కల్కి చిత్ర బృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్ర బృందంతో పాటు సినిమా ప్రధాన పాత్ర ధారులైన హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Kalki 2898AD team received notices for this reason
Kalki 2898AD

కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడాన్ని ఆయన తప్పు పట్టారు. మన పురాణాల్లో ఉన్న వాటికి కల్కి సినిమా విరుద్ధంగా ఉంది. ఈ సినిమా మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. చిత్ర బృందం స్పందన కోసం మేం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్‌నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలు, ఇతిహాసాలపై జనాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది’ అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే ఈ సినిమాతో మహాభారతం, కల్కి గురించి గొప్పగా చెప్తే ఇలా మనోభావాలు దెబ్బ తీసారని నోటీసులు పంపించడంతో అభిమానులు, సినిమా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సినిమా ముందు డిస్క్లైమర్ చదవలేదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago