Kalki 2898AD On OTT : నాలుగున్నరేళ్లుగా చిత్రీకరణ జరుపుకొని జూన్ 27న విడుదలైన మైథలాజికల్ మూవీ కల్కి. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశాపటానీ నటించిన ఈ చిత్రం హలీవుడ్ టెక్నాలజీ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అత్యుత్తమ సాంకేతికతతో రూపొందించడంతో బడ్జెట్ బారీగా అయింది. ఈ సినిమాను 600 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను సుమారుగా 50 కోట్లకు అమ్మినట్టు సమాచారం.
నార్త్ అమెరికాలో నాలుగో రోజు బుకింగ్ ముగిసే సమయానికి కల్కి చిత్రం అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం 11 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 90 కోట్లకుపైగా కలెక్షన్లను యూఎస్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ చిత్రం 5వ రోజు ముగిసే సమయానికి 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫార్మ్ అయ్యిందని, తెలుగు, మలయాళ,ల తమిళ, కన్నడ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్, అలాగే హిందీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు టాక్ వచ్చింది.
అంతే కాకుండా జూలై లాస్ట్ వీక్ కల్లా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు అందులో రాసుంది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా ఇచ్చిన ఓటీటీ డేట్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఓటీటీ ప్లాట్‌ఫాంలను అడిగారట మేకర్స్. సినిమాను ఇంకొన్ని వారాలపాటు థియేటర్లలోనే నడిపించాలని అందుకే ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా సెప్టెంబరు రెండో వారానికి గానీ ఓటీటీల్లో రిలీజ్ చేయాలనుకోవడం లేదని సమాచారం. ఇక క్రియేటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ యానిమేషన్‌తో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించగలిగారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…