Kalki 2898AD 3 Days Collections : మూడు రోజుల‌లో క‌ల్కి సాధించిన క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..?

Kalki 2898AD 3 Days Collections : మహాభారతం కాలాన్ని, ఫ్యూచర్ జనరేషన్ తో క‌నెక్ట్ చేసి యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి 2898 ఏడి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నది. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతకంతకు రికార్డులు క్రియేట్ చేస్తున్నది. నాగ్ అశ్వీన్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల ఊహకు అందని విధంగా బాక్సాఫీస్ సునామీని క్రియేట్ చేస్తున్నది. ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ మూడు రోజుల్లో రూ.415 కోట్లుకుపైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్​ ఆదివారం ప్రకటించింది. చూస్తుంటే సోమ‌వారం స‌మ‌యానికి క‌ల్కి మూవీ 500 కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.

విడుదలైన రోజు నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌ బాబు, అల్లు అర్జున్‌ తదితరులు ‘కల్కి’ ఓ అద్భుతమని పేర్కొన్నారు. విజువల్స్‌ పరంగానే కాదు కామియో రోల్స్​తోనూ ఈ మూవీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసింది. హీరోలు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ తదితరులు ఈ సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించడం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ కలిసి రూపొందించిన కల్కి చిత్రం ఓవర్సీస్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సుమారుగా 70 కోట్ల రూపాయలకు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kalki 2898AD 3 Days Collections do you know how much it got
Kalki 2898AD 3 Days Collections

ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించినట్టు తెలుస్తున్నది. ఉత్తర అమెరికాలో అంటే.. అమెరికా, కెనడాలో కల్కి చిత్రం కలెక్షన్లు భారీ తుఫాన్‌ను తలపిస్తున్నాయి. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులన్నింటిని తిరగరాస్తున్నది. ఈ సినిమా అమెరికాలో 10 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 83 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక అమెరికాలో కాకుండా యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, గల్ఫ్, యూఏఈలో ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ కాకుండా మిగితా దేశాల్లో 4 మిలియన్ల డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 33 కోట్ల రూపాయ‌లు రాబట్టింది. జపాన్‌లోనూ అభిమానులను కలిగిన టాలీవుడ్‌ హీరోల్లో ప్రభాస్‌ ఒకరు. జపాన్‌కు చెందిన ముగ్గురు మహిళలు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ‘కల్కి’ సినిమాని చూసి ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సుమారుగా 70 కోట్ల రూపాయలకు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago