Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు. విక్రమ్ సినిమాతో హిట్ అందుకున్న కమల్ రీసెంట్‌గా వచ్చిన కల్కి చిత్రంలో కీలక పాత్ర పోషించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కల్కి సీక్వెల్ లో కమల్ హాసన్ రోల్ మరింతగా ఎక్కువాగా అలాగే కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డ్స్ క్రియెట్స్ చేస్తూ దూసుకుపోతుంది. అలాగే కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ చాలా గెటప్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకుసీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2010లో కానీ అంతకు పదేళ్ల ముందే శంకర్ రోబో చిత్రం తీయాలనుకున్నాడు. కమల్ హాసన్‌ను హీరోగా, ప్రీతి జింతాను కథానాయికగా అనుకుని.. వాళ్లిద్దరి మీద లుక్ టెస్ట్ కూడా చేశాడు. ఆ ఫోటోలు కూడా తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఐతే తాను ఈ చిత్రం చేయకపోవడానికి కారణమేంటో ఓ ఇంటర్వ్యూలో కమల్ తెలియజేశాడు. తనను ‘2.0’లో అక్షయ్ కుమార్ చేసిన విలన్ పాత్రకు కూడా శంకర్ అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కమల్.
ఐ రోబో అనే నవల ఆధారంగా సినిమా చేయాలని నేను, శంకర్, రచయిత సుజాత అనుకున్నాం. 90ల్లోనే ఆ చర్చ జరిగింది. నా పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. సినీ పరిశ్రమలో బడ్జెట్లు, రెమ్యూనరేషన్లు.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి. అప్పటి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేయకపోవడం మంచిది అనిపించింది. అందుకే నేను వెనుకంజ వేశాను. కానీ నా మిత్రుడు శంకర్ మాత్రం పట్టుదలతో ఆ సినిమాను కొన్నేళ్ల తర్వాత తెరకెక్కించాడు. అది ఘనవిజయం సాధించింది. తర్వాత నన్ను ‘2.0’ కోసం శంకర్ అడిగాడు. కానీ ఇంకా కొన్నేళ్ల పాటు నన్ను నేను హీరో పాత్రలోనే చూసుకోవాలనుకుంటున్నానని, విలన్ పాత్ర చేయనని చెప్పా’’ అని కమల్ నవ్వుతూ చెప్పాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…