KA Paul : ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కూడా తెగ సందడి చేస్తూ ఉండే కేఏ పాల్ ఈ సారి ఏపీ అసెంబ్లీ, లోక్ సభలలో ఎన్నికలలో కూడా హంగామా చేయనున్నాడు. ఈ ఎన్నికల్లో కేఏ పాల్‌కు ప్రజాశాంతి పార్టీకి కొత్త గుర్తు వచ్చింది. ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కొత్త గుర్తును కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించిందని కేఏ పాల్ తెలిపారు. మాకు కుటుంబ పాలన వద్దు, కుండ పాలన కావాలని అన్నారు. కుంట గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ ఉమ్మడి గుర్తుతో పోటీ చేస్తుందన్నారు.
కుటుంబ పాలన మనకు వద్దని కుండ పాలన కావాలని అభిప్రాయపడ్డారు. కుండ గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ కు కేఏ పాల్ దన్యవాదాలు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లో కామన్ సింబల్ తో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. శాంతి పాలన రావాలంటే కుండ పాలన రావాలని తెలిపారు. మండుతున్న ఎండలకు డాక్టర్లు ,సైంటిస్టులు ఫ్రిజ్ లోని నీళ్లు తాగొద్దని చెబుతున్నారని అందుకే మంచి జరగాలన్న మంచి చేయాలన్న కుండ పాలన రావాలని అన్నారు. గతంలో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ కుండ గుర్తును కేటాయిచింది ఈసీ.
లోక్‌సభ ఎన్నికలు-2024లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావడం కొంత మందికి ఇష్టం లేదని అన్నారు. ‘‘ నేను సీఎం అయితే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరిపోతుంది. ప్రజలను బానిసలుగా ఉంచాలని పాలకులు చూస్తున్నారు. 7 ప్రధాన అంశాలతో ఎన్నికల్లోకి వెళ్తాం. మంచి పాలన కోసం ప్రజాశాంతి పార్టీకి పట్టం కట్టండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి విశాఖను రాజధానిగా చేస్తాను. ఐదేళ్లలో విశాఖను వాషింగ్టన్ డీసీకి ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్తా. విశాఖకు లక్ష కోట్లు ఆదాయం తెస్తా. విశాఖ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ చేస్’’ అని కేఏ పాల్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…