Pothina Mahesh : త‌న‌ని విమ‌ర్శించే వారికి పోతిన మ‌హేష్ గ‌ట్టి కౌంట‌ర్.. వారాహికి క‌ట్టిన నిమ్మ‌కాయ‌ల డబ్బులు కూడా నావే..!

Pothina Mahesh : ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న స‌మ‌యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది. సీట్లు దక్కని అసంతృప్త నేతలు పార్టీ వీడతున్నారు. రీసెంట్‌గా జనసేన నేత పోతిన మహేష్ మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్‌ రెడ్డి సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడినా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. జనసేనకు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. ఉదయాన్నే భారీ ర్యాలీగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా గంటావారిపాలెం చేరుకున్నారు. జగన్‌ బస్సుయాత్ర స్టే పాయింట్ దగ్గర అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.

విజయవాడ వెస్ట్ టిక్కెట్ కన్ఫామ్ అయ్యాక, సుజనా చౌదరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదెందుకో, పోతిన మహేష్‌కి నచ్చలేదు. అప్పటినుంచీ ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. జనసేనలో అంతర్యుద్ధానికి తెరలేపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపించుకుని మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. పోతిన మహేష్ జనసేన పార్టీని వీడి, వైసీపీలో చేరిపోయారు. ఇక్కడే విజయవాడ వెస్ట్ ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. ఒక్కసారిగా జనసైనికులు సుజనా చౌదరి పట్ల సానుకూలతను ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇదంతా, పోతిన మహేష్ మీద ఏర్పడ్డ అసహనం తాలూకు ఫలితమే.

Pothina Mahesh sensational comments on pawan kalyan
Pothina Mahesh

పోతిన మహేష్ గనుక జనసేన పార్టీని వీడకుండా వుండి వుంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీకి పడాల్సిన జనసేన ఓట్లలో ఎంతో కొంత కోత పడి వుండేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పోతిన మాట్లాడుతూ.. సుజ‌నా చౌదరి.. ప‌వ‌న్ త‌ల్లిని తిట్టాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా.. మీలా నేను రెండు జెండాలు మోయ‌లేను. నేను ఏది చేసిన నిజాయ‌తీగా చేస్తాను. మీలా డ‌బుల్ గేమ్‌లు ఆడాను. జ‌న‌సేన పార్టీ కోసం నేను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. మీరు నా గురించి త‌ప్పుగా మాట్లాడితే అస్స‌లు బాగుండ‌దు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశ‌రు మ‌హేష్.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

16 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago