KA Paul : ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్‌కి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అయితే బీజేపీని తెలంగాణలో గెలిపించేందుకు వారితో పొత్తు పెట్టుకున్నారు. పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు పలు ప్రాంతాలలో పర్యటించారు. ఎనిమిది స్థానాలలో జనసేన తరపున కూడా పలువురు అభ్యర్ధులని నిలుచోబెట్టాడు. అన్ని చోట్ల కూడా దారుణంగా ఓట్లు పడ్డాయి. దీంతో పవన్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌కి తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు పవన్‌ను తరిమి తరిమి కొట్టారని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం వచ్చి పవన్ మాట్లాడుతున్నారని.. ఇక్కడ నుంచి కూడా వెళ్లిపో.. ప్యాకేజీ స్టార్‌వి.. పవన్ అవినీతి పార్టీ టీడీపీతో ఉన్నారన్నారు. చీంరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారు.. పవన్ ఏమో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయడానికి చూస్తున్నారన్నారు. దమ్ముంటే అవకాశమివ్వాలని.. ఆంధ్రప్రదేశ్‌లో 175కు 175 స్థానాలు గెలుస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తానే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిందని.. 65 సీట్లు వస్తాయని చెప్పానని, అలానే వచ్చాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్లు అప్పుల పాలు అయ్యిందని.. అందుకు కారణం కేసీఆర్ అండ్ కో అని కేఏ పాల్ ఆరోపించారు. తెలంగాణను నడపాలంటే సత్యం బయటకు రావాలని పాల్ అభిప్రాయపడ్డారు. దాని కోసం వెంటనే.. రాష్ట్రం చేసిన అప్పులపై ఇన్వెస్టిగేషన్ జరిపించాలని.. అంత వరకు ఎవరిని కూడా దేశం వదిలి బయటకు వెళ్లనీయకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. రిటైర్డ్, ప్రస్తుత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. సీఎం రేవంత్ రెడ్డికి సీఐడీకి సహకరించాలని పాల్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే.. కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…