KTR : కాంగ్రెస్ పార్టీ చ‌చ్చిన పాము అంటూ కేటీఆర్ కామెంట్స్.. భ‌ట్టి ఆనాడు చెప్పింది చేసి చూపించాడుగా..!

KTR : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన విష‌యం తెలిసిందే. ప‌దేళ్ల‌పాటు ప‌రిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉంది. అయితే రీసెంట్‌గా శాసన సభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తదితరులు ప్రమాణం చేశారు. అనంతరం మిగతా సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణం చేసారు. సభకు మొత్తం 109 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా తెలంగాణ సమావేశాలను బాయ్ కట్ చేసిన బీజేపీ శాసన సభా నియమాలను కాంగ్రెస్ కాలరాస్తుందని ఆరోపించింది. ఈ క్రమంలోనే బిజెపికి సంబంధించిన ఎనిమిది మంది సభ్యులు గైర్హాజరయ్యారు.

ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయలేదు. తండ్రి బి ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కు సర్జరీ జరగడంతో ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో మరో రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి తనకు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు. కెసిఆర్ బాత్రూంలో జారిపడడం, ఆయన తుంటి ఎముక విరగడంతో నిన్న రాత్రి ఆయనకు సర్జరీ జరిగింది. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన కూడా ఎమ్మెల్యేగా తర్వాతే శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ప‌దవిలోకి వ‌చ్చాక కొన్ని పాత వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

KTR comments about mallu bhatti vikramarka old video viral
KTR

అందులో భాగంగా కేటీఆర్ ఓ సంద‌ర్భంలో కాంగ్రెస్ పార్టీని చ‌చ్చిన పాము అని అన్నారు. తెలంగాణ‌లో అభివృద్ధిని చూసి వారు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. విఫ‌లాల గురించి మాట్లాడ‌డానికి వారి ద‌గ్గ‌ర ఏం లేద‌ని అన్నారు. ప‌ద‌వుల కోసం ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టు పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. అంతేకాదు ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ని పాకిస్తాన్ టీంతో పోల్చిన కేటీఆర్ ఉంది న‌లుగురు ఎమ్మెల్యేలు కాని తెలంగాణ‌ని మొత్తం ప‌రిపాలిస్తామ‌ని అంటున్నారు అని విమ‌ర్శ‌లు చేశాడు. అయితే ఆ స‌మ‌యంలో మాకు ఓ టైం వ‌స్తుంద‌ని భ‌ట్టి అన్నారు. ఆ టైం రానే వచ్చింది. భ‌ట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు కేటీఆర్ మాట్లాడిన ఆ మాట‌ల‌కి ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి పంచ్‌లు ఇస్తారో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago