MLC Kavitha : కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల ప్రచారాలు ఎంత వాడివేడిగా సాగాయో మనం చూశాం.ముఖ్యంగా కవిత, కేటీఆర్, హరీష్ రావు నిప్పులు చెరిగారు. కొద్దిరోజుల క్రితం కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తని.. ప్రేమకు పరాకాష్టగా అభివర్ణించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని కవిత ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృథాగా ఇస్తున్నామంటున్నారని తెలిపారు.
అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రేవంత్‌కి బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక గౌరవం అందిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకొని.. రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్‌ని పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి.. బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్‌ను పలకరించి, కేసీఆర్ ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి కవిత ఎదురు కాగా, ఆమెకి కూడా నమస్కరించి పలకరించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి.
కేసీఆర్‌ని పరామర్శించిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కి పూర్తి సహాయ సహకారాలు అందించాలనీ, అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని సీఎస్‌ని ఆదేశించానన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరినట్లు తెలిపారు. అలాగే.. కేసీఆర్ ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలనీ, ఆయన సూచనలను అందించాలని, అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కాగా, ఇటీవల తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూంలో కాలు జారి పడి, కాలికి గాయం అవ్వడంతో… సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు కేసీఆర్. ఆయనకు డాక్టర్లు.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ నడిచారు కూడా. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రత్యేక డాక్టర్ల బృందం నిరంతరం ఆయన్ని పర్యవేక్షిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…