Jr NTR : నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని అలరించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాలీవుడ్‌కి కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పలువురు హాలీవుడ్ దర్శకులు ఎన్టీఆర్‌ని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రం ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభం కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 టీమ్ ఓ ఖతర్నాక్ అప్ డేట్‌ను ఇచ్చింది. ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు ఫస్ట్ లుక్‌లో ఎన్టీఆర్ వావ్ అనిపించారు.
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ 2024 మార్చి నుంచిమొదలు కానుందని ప్రకటించింది టీమ్. బాలీవుడ్ సినిమాలలోను ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ 2లో జూనియర్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే కెరీర్‌లో ఈ స్థాయికి ఎంతో కష్టపడి వచ్చిన ఎన్టీఆర్ కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాడు. అవి కూడా చేసి ఉంటే ఆయన స్థాయి వేరే లెవల్‌లో ఉండేది. దిల్(2003) సినిమా ని మొదట జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారు కానీ అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ లో స్టూడెంట్ కథ చేసిన కారణంగా రిజెక్ట్ చేశాడు. ‘అతనొక్కడే’,’కిక్’ సినిమా ల ను మొదట జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించిన ఆయన రిజెక్ట్ చేశాడు.
ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ఆర్య’ సినిమా ని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలి అనుకున్నారు కానీ ఆ లవ్ స్టోరీ తనకు సెట్ కాదు అని రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చెంతకు చేరింది..ఆర్య సినిమా తో అల్లు అర్జున్ కి వచ్చిన స్టార్డం ఎలాంటిదో మనం చూశాం. ఇక బోయపాటి శీను మొదటి సినిమా ‘భద్ర’ మూవీ ని కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నారు కానీ రవితేజ తో చేసారు . ఇలాఎన్టీఆర్ వదులుకున్న ఈ సినిమా లు ఇతర హీరో ల కి వాళ్ళ కెరీర్ ల కి చాలా ఉపయోగపడ్డాయి. వాటిని ఎన్టీఆర్ చేసి ఉంటే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కుతుందని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…