Devara : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డం సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఈ ‘దేవర’కాగా, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రోజులు పాటు వెయిట్ చేశారు. మంచి కథ కుదిరే వరకు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తొందర పెట్టినా ఆయన కూల్‌గా ఉంటూ వచ్చారు.
పెరిగిన ఇమేజ్ దృష్ట్యా మంచి స్క్రిప్ట్‌తోనే ఆడియెన్స్‌ను ఆయన అలరించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. . రీసెంట్‌గానే కొరటాల శివ కథ నచ్చడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయారు. తాజాగా విడుదలైన లుక్‌లో ఎన్టీఆర్.. నల్ల పంచె, చొక్కా, కాలికి, చేతికి కడియాలు, చేతిలో పెద్ద ఆయుధం పట్టి యోధుడిలా కనిపించాడు. అనిరుద్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ టెక్నిషియన్స్ సైతం యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే..‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారట.
చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పేరే ‘దేవర’ అని టాక్. మరి కొడుకు పాత్రలోని ఎన్టీఆర్ పేరేంటో చూడాలి. అంటే ఎన్టీఆర్ రెండు లుక్స్‌లో మెప్పించబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రావాలా, నా అల్లుడు, అదుర్స్ చిత్రాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్, జై లవకుశలో అయితే ట్రిపుల్ రోల్‌లో మెప్పించిన విషయం తెలిసిందే. సముద్ర నేపథ్యంలో సాగుతుంది. హీరో క్యారెక్టర్ రాక్షసులను భయపెట్టే వీరుడిలా ఉంటుందన్నారు. ఇక దేవర ఎందుకు కత్తి పట్టాడు? తన శత్రువులు ఎవరు? వాళ్ళు తనకు లేదా తన వాళ్లకు చేస్తున్న అన్యాయం ఏమిటీ? అన్న విషయాలని దేవరలో చూపించనున్నాడు కొరటాల. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…