Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన జూనియర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. గత కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నేరుగా ఓ సినిమా చేస్తున్నారు తారక్. యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 చిత్రంలో తారక్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ సైతం ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ‘వార్ 2’ గురించి యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటన చేసింది. స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించింది. అయితే ఈ సినిమాలో నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. గతంలో జై లవ కుశ సినిమాలో తారక్ నెగిటివ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపించి అలరించాడు . జై పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు తారక్. ఓవైపు పాజిటివ్ షేడ్స్, మరోవైపు హీరోయిజం చూపించి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. వార్ 2 సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
‘వార్’ సినిమాలో లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించి అలరించాడు. అయితే ఇందులో చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.. ‘వార్’ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, ‘వార్ 2’కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…