Ali Basha : తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు విక్రమ్. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ అనే సినిమా చేస్తోన్నాడు విక్రమ్. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా సెట్స్‌లోవిక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోన్న అతడు త్వరలోనే తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. మరోవైపు జైలర్ సినిమాతో రజనీకాంత్ బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, తమన్నా కీలక పాత్రల్ని పోషిస్తోన్నారు.
విక్రమ్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. విక్రమ్ తన కెరీర్ మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు తో కూడా కలిసి నటించాడు ఇక ఆ సినిమా ‘బంగారు కుటుంబం’.. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. అప్పట్లో శ్రీకాంత్ సతీమణి ఊహతో కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు విక్రమ్. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఊహ’.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి..ఈ సినిమాలో విక్రమ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.. ఈ సినిమాను శివాల ప్రభాకర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు.
కమెడియన్ ఆలీ హీరోగా నటించిన ఊహా సినిమాలో విక్రమ్ విలన్‌గా తన నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత విక్రమ్ పలు తెలుగు సినిమాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాకపోవడంతో తమిళంకి పరిమితం అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. తమిళంలో కాశీ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ అక్కడ నుండి వరుస సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు. విక్రమ్ కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా మారాడు. విక్రమ్ తన కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాలతో పాటుగా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…