Jr NTR : ఎన్టీఆర్‌కి కోపం తెప్పించిన అభిమానులు.. ఏం చేశాడో చూడండి..!

Jr NTR : ఈ రోజు విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి కాగా, అంత‌టా ఈ వేడుక‌ల‌ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు, అభిమానులు ప్ర‌తి ఒక్క‌రు కూడా తమ అభిమాన నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్‌లోని ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు శ్రద్దాంజలి ఘటించారు. అయితే ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో తోపులాట జ‌రిగింది. అయితే ఎన్టీఆర్‌కు నివాళులర్పించడానికి ఆదివారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్ అక్క‌డికి చేరుకోగా, అప్ప‌టికే అభిమానుల‌తో ఎన్టీఆర్ మార్గ్ కిక్కిరిసి పోయింది.

అయితే జూనియ‌ర్‌కి అక్క‌డికి చేరుకోడం చాలా ఇబ్బందిగా మారిన కూడా వారిని తోసుకొంటూ ముందుకు సాగారు. ఓ దశలో ఇద్దరు బొకేను ఎన్టీఆర్‌ సమాధిపై పెట్టడానికి తోసుకుంటుండగా.. వారిని పక్కకు తోసేసి ఎన్టీఆర్ ముందుకు సాగారు. అభిమానులు అడ్డుగా ఉండగానే ఎడమ చేత్తో గులాబీ రెక్కలను తీసుకొని.. కాస్త చిరాకుతో సమాధిపై పెట్టి మనస్పూర్తిగా నివాళులర్పించారు. అయితే తాతగారికి నివాళులర్పించే ప్రతీ క్షణంలో ఆయన ముఖంలో కోపం, అసంతృప్తి, అసౌకర్యం ముఖంలో స్ప‌ష్టంగా కనిపించింది. రకరకాల ఇబ్బందుల వల్ల ఎన్టీఆర్‌ మొక్కుబడిగా తాతకు నివాళులర్పించినట్ట‌గానే ఉంది.

Jr NTR became angry because of his fans
Jr NTR

అయితే ఎన్టీఆర్ అక్కడికి వ‌చ్చిన స‌మ‌యంలో అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జై అంటూ అరుస్తూనే మ‌రోవైపు సీఎం సీఎం అంటూ గట్టిగా అరిచారు. అయితే అభిమానుల గోలను పట్టించుకోకుండా ఎన్టీఆర్ తన పనిని తాను ముగించుకొని అసంతృప్తిగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎన్టీఆర్ నివాళులర్పించే కార్యక్రమం రసాభాసగా మారింది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు మంత్రి శ్రీనివాసయాదవ్, నటుడు రాజేంద్ర ప్రసాద్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తారకరత్న సతీమణి, ఆమె పిల్లలు, బాల‌కృష్ణ‌, త‌దిత‌రులు ఉన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago