Bandla Ganesh : బండ్ల గణేష్ కమెడీయన్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో రాజకీయాలలోకి కూడా వెళ్లాడు. అక్కడ తేడా కొట్టడంతో తిరిగి మళ్లీ సినిమాలు చేసే ప్రయత్రంలో ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులని అలరిస్తూ వస్తున్నాడు. గత కొద్ది రోజులుగా స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్స్ వేస్తున్నారు. అయితే అది డైరెక్ట్‌గా కాదు ఇన్ డైరెక్ట్‌గా. ఎక్కడా త్రివిక్రమ్ పేరుని నేరుగా ప్రస్తావించకుండా గురూజీ అని సంబోధిస్తూ విమర్శలు చేస్తున్నాడు బండ్ల గణేష్. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్‌తో ఓ నెటిజన్ తను ప్రొడ్యూసర్ కావాలనుకుంటున్నానని కోరికను వ్యక్తం చేశాడు.
దానికి ఆయన రియాక్ట్ అవుతూ ‘గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వు. నువ్వు అనుకున్నది అయిపోతుంది’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేశాడు. అక్కడ నుంచి వరుస ట్వీట్స్ వేశాడు. ఇవన్నీ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏదైనా కథ చెప్తే దాన్ని తిప్పి తిప్పి మార్చి మార్చి అదే సినిమా ని తెరకెక్కిస్తారట.. నిజమేనా..?” అని అడగగా.. “గురూజీ అన్నదమ్ములను .. భార్యాభర్తలను.. తండ్రి కొడుకులను.. గురు శిష్యులను అందరిని .. విడదీసే శక్తి ఉంది . మరి ఆయనకు ఇలాంటివి పెద్ద విషయమా ..?” అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో స్టార్ కపుల్‌ని విడగొట్టింది త్రివిక్రమేనా అని చర్చ నడుస్తుంది.
బండ్ల గణేష్ తన ట్వీట్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. సాగినంత కాలం నా అంత వాడు లేడంటారు సాగకపోతే ఊరక చతికిల పడిపోవుదురు.. చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మ.. గురూజీ అంటూ కామెంట్ పెట్టాడు. ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి’ అని మరోసారి త్రివిక్రమ్ పై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కొందరు నెటిజన్స్ బండ్ల గణేష్‌కి సపోర్ట్ చేస్తుంటే కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం లేదు బండ్ల గణేష్. . ఇప్పుడు రవితేజను పొగుడుతున్నాడు. మరో వైపు రాజకీయాల్లోకి ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. త్వరలో రాజకీయాలలో మళ్లీ చురుకుగా ఉండాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైన ఇటీవలి కాలంలో బండ్ల గణేష్ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…