Jr NTR : ప్రస్తుతం ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న చందాన వార్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకుంటా వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన రాజకీయ నాయకులు రోజా, కొడాలి నాని వంటి వారు మాత్రమే దారుణమైన పరుషజాలంతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు.అయితే కొడాలి నాని విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తోనానికి మంచి స్నేహం ఉదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడాలి నాని పొలిటికల్ కెరియర్ ప్రారంభం కావడానికి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కారణమైతే ఆయన గుడివాడ సీటు తెచ్చుకోవడానికి కారణం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని అంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టడం వల్లే కొడాలి నానికి మొదటిసారిగా గుడివాడ టికెట్ ఇచ్చారని తెలుగుదేశం వర్గాల్లో నిత్యం ఆసక్తికర చర్చ నడుస్తూ ఉంటుంది.
అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతలు అన్నీ హరికృష్ణ ..కొడాలి నానికి అప్పగించడంతో ఆది సినిమా విషయంలో దాదాపు అన్ని బాధ్యతలు తానే అన్నీ అయి వ్యవహరించారు కొడాలి నాని. అయితే వారిద్దరి మధ్య ఇప్పుడు అసలు టచ్ లేదు అంటున్నారు. ఎప్పుడైతే కొడాలి నాని తెలుగుదేశానికి స్వస్తి చెప్పి వైసీపీలో చేరారో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య టచ్ లేదని వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.. ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా ఉంటాడని అతనికి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో బాగా తెలుసని , ఎన్టీఆర్ కి తెలిసినంత బాగా మరెవరికి తెలియదని పలువురు చెప్పుకొస్తున్నారు.
ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీ పెట్టి తనను ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను ఆయన వెంట నడుస్తానని వైసీపీ నేత కొడాలి నాని చెబుతూ ఉంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు కామెంట్లు చేశారు. తనకు జగన్ అంటే చాలా ఇష్టమని అంతకన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని కొడాలి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని ఆయన హ్యాండోవర్ చేసుకున్నా లేక సొంత పార్టీ పెట్టుకున్నా సరే తాను ఆయన వెంట నడవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని నాని చెప్పుకొచ్చారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకకి హజరు కాని నేపథ్యంలో ఆయనపై పలువురు విమర్శలు గుప్పించారు. అప్పుడు నాని.. జూనియర్‌ని సమర్ధిస్తూ మాట్లాడారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…