Balakrishna : రజనీకాంత్ ముందు నువ్వెంత‌.. రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌..

Balakrishna : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ఎంత వాడివేడిగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. రాజ‌కీయాల వ‌ల‌న పెద్ద పెద్ద స్టార్స్ కూడా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. ఇటీవ‌ల‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వచ్చి చంద్రబాబును ప్రశంసిస్తూ రజినీకాంత్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగింది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ చంద్రబాబు ని పొగుడుతూ వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా విమ‌ర్శించాయి. ముఖ్యంగా రోజా.. రజనీకాంత్ ఏపీలో మాట్లాడిన వ్యాఖ్యలతో ఆయన జీరో అయిపోయారు అని పేర్కొన్నారు.

రాజకీయాలు వద్దు అనుకున్న రజినీకాంత్ కు ఏపీ రాజకీయాలతో ఏం పని ఉందని మంత్రి రోజా ప్రశ్నించారు. అంతేకాదు రజినీకాంత్ కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం తమకు లేదని, తాము చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని మంత్రి రోజా స్ప‌ష్టం చేసింది. రోజా వ్యాఖ్య‌లు తీవ్ర దూమారం రేపాయి. ఒక పెద్ద స్టార్‌ని, అందులో వ‌య‌స్సులో పెద్దాయ‌న అయిన వ్య‌క్తిని ఇలా అంటావా అంటూ మంత్రి రోజాకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేశారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే ఎవ‌రైన స‌రే ఊరుకునే ప్ర‌సక్తి లేద‌ని త‌లైవా ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు.

Balakrishna given warning to roja
Balakrishna

ఇక బాల‌య్య కూడా ఓ సంద‌ర్భంలో రోజాకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. అస‌లు ర‌జ‌నీకాంత్ ముందు నువ్వెంత అని ఆమెని తిట్టిన‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ లో బాలకృష్ణ, రోజా అంటే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లు. అంతేకాదు వేరు, వేరు పార్టీల తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రోజా అయితే బుల్లితెరలో కూడా నటిస్తూ, ప్రేక్షకుల ఆదరణ ద‌క్కించుకుంది. బాలకృష్ణ కూడా వ‌రుస సినిమాల‌తో సందడి చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే రాజ‌కీయాల వ‌ల‌న ఇప్పుడు వీరిద్ద‌రు బ‌ద్ధ శ‌త్రువులుగా మారారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago