Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కలిసి తొలిసారిగా దేవర అనే చిత్రం చేస్తున్నరు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి విహార యాత్రకు వెళ్లాడు. హాలిడే ట్రిప్ కోసం ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగా, తన భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి వేసవిలో చిల్ కావడానికి మరో ఫారెన్ ట్రిప్ కి వెళుతున్నారని అందరు అనుకున్నా అయితే ఇది షార్ట్ వెకేషన్ ట్రిప్ అని, వారం రోజుల్లోనే ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం.
ఇక జాన్వీ కపూర్ కూడా అప్పుడప్పుడు షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు జాన్వీ కనిపించిన కూడా ఫొటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో బంధిస్తుంటారు. అయితే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ విడివిడిగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన కూడా వారిద్దరికి సంబంధించి న పిక్స్ , వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రంకి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో షురూ చేసి రీసెంట్ గానే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు కొరటాల. ఈ టైటిల్ పోస్టర్ చూసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మరోసారి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనుండటంతో ఎంతో ఆతృతగా ఉన్నారు.
ఈ మూవీతో బాలీవుడ్ భామ, లేట్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో బీ టౌన్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రోల్ సినిమాకు మేజర్ అట్రాక్షన్ కానుందట. ఇప్పటికే దేవర షూటింగ్ సెట్స్ మీదకొచ్చిన సైఫ్.. పలు కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను అని భాషల ప్రేక్షకులకు దగ్గర చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కొరటాల శివ. ఈ మేరకు పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు రివీల్ కాగా.. నిన్నగాక మొన్న కేజీఎఫ్ ఫేం తారక్ పొన్నప్ప కూడా నటిస్తున్నారనే విషయం బయటకొచ్చింది.