Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపింది. ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్ కాస్త తగ్గింది. దీంతో గ్లామర్ షో ఎక్కువగా చేస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ పీక్స్ లో ఉంది. తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమానే కాకుండా.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలోనూ ఈ మిల్కీ బ్యూటీ కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇవే కాకుండా.. అటు ఓటీటీలోనూ బ్యాక్ టూ బ్యాక్ వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది తమన్నా.
తాజాగా ఆమె నటించిన కొత్త సిరీస్ జీ కర్దా స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో మేకర్స్ వీడియో విడుదల చేశారు . ఇందులో తమన్నా చాలా హాట్‌గా కనిపించనుంది. తాజా వీడియోలో అనసూయ పొట్టి దుస్తులలో మెరుస్తూ తన పరువాలన్నింటిని చూపిస్తూ కుర్రాళ్లకు పూనకాలు తెప్పిస్తుంది. తమన్నా క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఫ్రెండ్‌షిప్, లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన జీ కర్దా సిరీస్ జూన్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు.
బాల్యం నుంచి జీవితంలో స్థిరపడే వరకు ఏడుగురి మిత్రుల ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథే జీ కర్దా. దీనికి డైరెక్టర్ అరుణిమ శర్మ దర్శకత్వం వహించగా.. ఈ సిరీస్ లో ఆషిమ్, సుహైల్ నాయర్, అన్యా సింగ్, హుస్సేన్ తదితరులు పోషించారు. తమన్నాకి ఈ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న తమన్నాకి ఓ మంచి హిట్ కావల్సి ఉంది.