Funny Run Outs : ఇప్పుడు క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ గేమ్‌గా మారింది. చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు క్రికెట్‌ని ఎంతో ఇష్టపడుతున్నారు. వాటికి సంబంధించిన విషయాలపై తెగ ఆసక్తి కూడా చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం క్రికెట్ చరిత్రలో అత్యంత ఫన్నీ రనౌట్స్ గురించి తెలుసుకుందాం. ఒక మనిషి యొక్క తెలివి తేటలను ఐక్యూతో సూచిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషికి ఎంత ఎక్కువ ఐక్యూ ఉంటే అతను అంత ఎక్కువ తెలివైన వాడు అని అర్ధం. కాగా క్రికెట్ లో తమ ఐక్యూ మిగతా ప్లేయర్స్ ఐక్యూ తో పోల్చుకుంటే చాలా ఎక్కువని ఈ క్రికెట్ రనౌట్స్ తెలియజేస్తుంటాయి.
బ్యాట్స్‌మెన్స్ కి సరైన కోఆర్డినేషన్ లేకపోవడంతో రనౌట్ అవుతుంటారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే క్రీజులోకి రావడం, దాని వలన రనౌట్ కావడం క్రికెట్‌లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ లేకుంటే ఇలాంటివే జరుగుతాయని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అది జట్టుపై ప్రభావం చూపుతుందని సెటైర్లు వేస్తున్నారు. టీమ్ ఓటమికి కూడా కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోని చూస్తే పాక్ ఆటగాళ్ల మధ్య సరైన కో ఆర్డినేషన్ లేక రనౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఫన్నీ రనౌట్ జరిగింది.
![Funny Run Outs : క్రికెట్ చరిత్రలో అత్యంత ఫన్నీ రనౌట్స్ ఇవే..! Funny Run Outs in cricket history](http://3.0.182.119/wp-content/uploads/2023/06/funny-run-outs.jpg)
వన్డేల్లో కన్నా టెస్ట్ మ్యాచ్‌లలో ఇలాంటి ఫన్నీ రనౌట్స్ ఎక్కువగా జరిగాయి. పరిగెత్తే క్రమంలో కాలు జారిపడిపోవడం వల్లనో లేదంటే ఒక్కోసారి క్రీజులో ఉన్నామో లేదో చూసుకోకుండా ఉండడం వల్ల ఈ రనౌట్స్ జరుగుతుంటాయి. ముందు ఎదుటి క్రికెటర్‌ని అబ్జర్వ్ చేసి పరుగెత్తాలని అలాచేస్తే రనౌట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అయితే క్రికెట్‌లో రారాజుగా వెలిగిన ఆస్ట్రేలియా ఇలాంటి ఫన్నీ రనౌట్స్ లో టాప్‌లో ఉండడం విశేషం.