Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం ప్రపంచమంతా బాదేసిన తర్వాత రామ్ చరణ్ కేమో హాలీవుడ్ సినిమా ఆఫర్లు తన్నుకొచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ డెవలప్ అయింది. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా, వాళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అదీ పాన్ ఇండియా మూవీల ఎఫెక్టు ప్లస్ ఆర్ఆర్ఆర్ గ్రేట్నెస్. వార్ 2 మూవీ కోసం యంగ్ టైగర్ అక్షరాలా వంద కోట్లు డిమాండ్ చేశాడని పెద్ద టాకే నడిచిందా మధ్యన. కానీ అదే నిజమని స్టేజ్ బై స్టేజ్ రివీల్ అవుతూ వస్తోంది. జూనియర్ అడిగిన వంద కోట్ల ఫిగర్ని వార్2 వాళ్ళు ఓకే చేశారని తాజా అప్డేట్. కాకపోతే ఇందులో చిన్న మెలిక ఉంది. అదేంటంటే? వంద కోట్లు జూనియర్ ఎన్టీఆర్ కి ఒకే మొత్తంగా పే చెయ్యరని, ప్రాఫిట్ షేరింగ్ బేస్ మీదనే సదరు వంద కోట్లు ముడతాయని మరో సమాచారం.
దీనికి ఎన్టీఆర్ అంగీకార ముద్రవేసి అగ్రిమెంటుపై సైన్ చేశాడని కూడా చెబుతున్నారు. ఎంతసేపూ హిందీవాళ్ళే మన తెలుగు మేకర్స్ సినిమాల్లో సాక్షాత్కరించడమే కానీ, తెలుగు స్టార్స్ హిందీలో సైన్ చేయడం ఇటీవలి రోజులలో ఇదే మొదటిసారి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. కొరటాల శివతో దేవర, తర్వాత ప్రశాంత్ నీల్ తో కలసి 31, మధ్యలో కన్నడ కాంతార, త్వరలో హృతిక్ రోషన్ తో వార్ 2 ఇలా కట్టుదిట్టంగానే ఉంది ఎన్టీఆర్ డౌన్ ద లైన్..ఫ్రేం. అఫ్ కోర్స్.. ఇది మొదలు. బాలీవుడ్ లో మనవాళ్ళ విస్ఫోటనం. ఇంకా ఎంతమంది మనవాళ్ళని కోరుకున్నా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ సినిమాలు దక్షిణాది స్టార్స్ లేకుండా మనగలిగే రోజులు పోయాయి. అక్కడిప్పుడు అమితాబచ్చన్లు ఎవరూ లేరు. మనవాళ్ళ మీద ఆదారపడాల్సిందే.
అయితే ఎన్టీఆర్‌కి సంబంధించి ఫ్యాన్స్ పూనకాలెత్తిపోతున్నారు. ఎన్టీఆర్ సినిమాలంటే జనాలకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటి లైనప్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన క్రేజ్ గ్లోబల్ స్థాయి చేరుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సినిమాలంటే జనాలలో క్రేజ్ ఫుల్‌గా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…