JD Chakravarthy : బ్ర‌హ్మానందం వ‌ల‌న చాలా టార్చ‌ర్ అనుభ‌వించాను.. జేడీ చ‌క్ర‌వ‌ర్తి షాకింగ్ కామెంట్స్..

JD Chakravarthy : జేడీ చ‌క్ర‌వ‌ర్తి పేరు ఇప్ప‌టోళ్ల‌కి అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని ఒక‌ప్పుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తికి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు. నేచురల్ యాక్టింగ్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. త్వ‌ర‌లో ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే జెడి చక్రవర్తి ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయ‌న త‌న‌ని బ్ర‌హ్మానందం టార్చ‌ర్ చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌నీ సినిమా జేడీ చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్రలో రూపొంద‌గా, ఇందులో బ్రహ్మానందం పోషించిన ‘ఖాన్ దాదా’ పాత్ర పోషిస్తారు. ఆయన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెడి చక్రవర్తి, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ అనే సినిమాను స్వయంగా జెడి చక్రవర్తి తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్లో బ్రహ్మానందం తనకు టార్చర్ చూపించారంటూ జె.డి చక్రవర్తి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

JD Chakravarthy interesting comments on brahmanandam
JD Chakravarthy

మనీ మనీ మోర్ మనీ.. సినిమా చేసేటప్పుడు చాలామంది నన్ను బ్రహ్మానందాన్ని ఈ సినిమా కోసం తీసుకోవద్దని అన్నారు. అయితే నేనే పట్టుబట్టి మరీ బ్రహ్మానందంను సినిమాకి కోసం కావాలని అన్నాను. ఆ సమయంలో నాతో బ్రహ్మానందం గురించి చాలా చెప్పారు. బ్రహ్మానందం టైంకి షూటింగ్ కి రాడు. వ్యానిటీ వ్యాన్లు అడుగుతాడు. హోటల్ నుంచి రకరకాల ఆర్డర్లు తనకే కాదు తన పక్కవాళ్లకు కూడా చెప్తాడు. తొమ్మిదిన్నర, పదింటికి వస్తాడు. 12 గంటలకు బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రేక్ మనం ఇవ్వం. తను తీసుకుంటాడు. ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్. మళ్లీ 3 గంటలకు వస్తాడు. 4 గంటలకు వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడు అని అన్నారు. దాంతో ఆయ‌న షూటింగ్ కి లేట్ వస్తారని తెలిసి అంతకంటే ముందే మేము కొన్ని సీన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఆయన తొందరగా వచ్చేసేవారు. అలా నా ప్లానింగ్ అంతా తారుమారు అవుతుండేది. అలా డైలీ నేను ఆయన వల్ల టార్చర్ అనుభవించానంటూ చెప్పుకొచ్చారు జే.డి చక్రవర్తి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago