JD Chakravarthy : జేడీ చక్రవర్తి పేరు ఇప్పటోళ్లకి అంతగా తెలియకపోవచ్చు కాని ఒకప్పుడు జేడీ చక్రవర్తికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు. నేచురల్ యాక్టింగ్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. త్వరలో ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది.
అయితే జెడి చక్రవర్తి ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తనని బ్రహ్మానందం టార్చర్ చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మనీ సినిమా జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందగా, ఇందులో బ్రహ్మానందం పోషించిన ‘ఖాన్ దాదా’ పాత్ర పోషిస్తారు. ఆయన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెడి చక్రవర్తి, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ అనే సినిమాను స్వయంగా జెడి చక్రవర్తి తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్లో బ్రహ్మానందం తనకు టార్చర్ చూపించారంటూ జె.డి చక్రవర్తి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మనీ మనీ మోర్ మనీ.. సినిమా చేసేటప్పుడు చాలామంది నన్ను బ్రహ్మానందాన్ని ఈ సినిమా కోసం తీసుకోవద్దని అన్నారు. అయితే నేనే పట్టుబట్టి మరీ బ్రహ్మానందంను సినిమాకి కోసం కావాలని అన్నాను. ఆ సమయంలో నాతో బ్రహ్మానందం గురించి చాలా చెప్పారు. బ్రహ్మానందం టైంకి షూటింగ్ కి రాడు. వ్యానిటీ వ్యాన్లు అడుగుతాడు. హోటల్ నుంచి రకరకాల ఆర్డర్లు తనకే కాదు తన పక్కవాళ్లకు కూడా చెప్తాడు. తొమ్మిదిన్నర, పదింటికి వస్తాడు. 12 గంటలకు బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రేక్ మనం ఇవ్వం. తను తీసుకుంటాడు. ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్. మళ్లీ 3 గంటలకు వస్తాడు. 4 గంటలకు వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడు అని అన్నారు. దాంతో ఆయన షూటింగ్ కి లేట్ వస్తారని తెలిసి అంతకంటే ముందే మేము కొన్ని సీన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఆయన తొందరగా వచ్చేసేవారు. అలా నా ప్లానింగ్ అంతా తారుమారు అవుతుండేది. అలా డైలీ నేను ఆయన వల్ల టార్చర్ అనుభవించానంటూ చెప్పుకొచ్చారు జే.డి చక్రవర్తి.