Jayaprakash Narayana : ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కొందరు తమ సర్వేలతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జేపీ మాట్లాడుతూ.. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని బుధవారం నాడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. వైసీపీ వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదన్నారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని జేపీ సూచించారు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా ఎపీలో ఇటువంటి ఆర్ధిక ప్రగతి అంటూ లేకుండా పోయిందన్నారు. గతంలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఏపీ, గత ఐదేళ్లుగా నిద్రాణంలోకి వెళ్లిపోయేలా పాలకులు చేశారన్నారు.ఎపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితికి తెచ్చారన్నారు. అయితే దోపీడీ, లేదా సంక్షేమం ఇదా ప్రజా పాలన అంటే పేద రాష్ట్రం ఒరిస్సా కన్నా ఘోరంగా ఎపీలో పరిస్థితి తయారైందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపే వారికే పట్టం కట్టండినీ ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువ ప్రస్తావన జరగడం విచారకరం అని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. కులాలకు అతీతంగా పనిచేసే నేత లేరని పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…