Roja : ప్రస్తుతం ఏపీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.ఇదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘వ్యూహం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై వీర మహిళలు నిరసన తెలిపారు.
సోమవారంనగరంలోని గాంధీ విగ్రహం వద్ద రామ్‌గోపాల్‌వర్మ, రోజా, అంబటి చిత్రాలతో రూపొందించిన బ్యానర్‌పై చెప్పులతో కొట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలను, పార్టీని చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ తాకట్టుపెట్టారని మంత్రులు వ్యాఖ్యానించడం తగదన్నారు. రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను బర్రెలతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. ఆర్జీవీ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.
మూవీని రిలీజ్ చేయొద్దంటూ.. సినిమాలోని పాత్రలు చూపించిన తీరు సరిగా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా ఆర్జీవీ వ్యూహం ఆఫీస్ ఎదుట రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తన ఇంటి ముందు మంటపెట్టిన దృశ్యాన్ని ఆర్జీవీ వీడియో తీసి ట్విటర్ పోస్ట్ చేయడం మరింత చర్చగా మారింది. పైగా ఆ వీడియోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు ట్యాగ్ చేశారు. ’మీ కుక్కలు నా ఇంటి ముందు మొరుగుతున్నాయి. పోలీసులు వచ్చే లోపు పారిపోయాయి’. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం వారిపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…