Minister Seethakka : అసెంబ్లీలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకుల మధ్య వారం ఎలా నడిచిందో మనం చూశాం. పదేళ్లపాటు పాలించి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా, 50 ఏళ్ల పాటుకాంగ్రెస్ పాలించి ఏం చేసింది అని విమర్శలు గుప్పించుకున్నారు.అయితే అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తన స్పీచ్‌తో అందరికి వణుకు పుట్టించింది.మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతోందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులకు అంత తొందరపాటు పనికి రాదన్నారు. అధికారం పోయిందన్న బాధ వారిలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
తాము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు కేటీఆర్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు ఇచ్చారని చెప్తారని అన్నారు. ఓ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు కేటీఆర్.
అయితే అసెంబ్లీలో సీతక్క మహిళల గురించి ప్రస్తావిస్తూ వారిని గౌరవించాలని, తరగతి గదులలో వారి గురించి పాఠాలు చెప్పాలని సీతక్క అన్నారు.ఈ రోజు మద్యపానం ఎక్కువైంది. అది నిత్యావసరం కాదు, దాని వల్ల ఎన్నో భయాలు ఏర్పడుతున్నాయి. వాటి సమయం కూడా కుదించాలి. ప్రజల ఆస్తులని ప్రైవేట్ వారికి దానా దత్తం చేయోద్దు. ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలి. మారుమూల జిల్లాలో ఐటీ చదివిన వారు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల కుండా ప్రతి జిల్లాలోను ఐటీని విస్తరించాలని కోరుతున్నాను అని అన్నారు సీతక్క.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…