Janasena Shashidhar : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ అధికారం దక్కించుకుంటాడా, లేదంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సారి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ చాలా కష్టపడుతున్నాడు. యువగళం పేరుతో యాత్ర నిర్వహిస్తున్న లోకేష్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు. కాకినాడ రూరల్, సిటీల నుంచి వేలల్లో తరలివచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో రహదారులు దద్దరిల్లాయి. వాహనాలు సైతం వెళ్లలేనంతగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరందరితో అడుగులు వేస్తూ లోకేశ్ దారిపొడవునా న్యాయవాదులు, మత్స్యకారులు, పేదలు, నిరుద్యోగుల నుంచి వినతులు స్వీక రించారు.
దారిపొడవునా వేలాది మంది లోకేశ్‌పై పూలవర్షం కురిపిం చారు. హారతులిచ్చి తిలకం దిద్దారు. మధ్యలో అభిమానులు లోకేశ్‌కు పూలదండలు వేయగా వాటిని తనతో నడుస్తున్న నేతల మెడలో లోకేశ్ తిరిగి వేయడం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ నుంచి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు, ఇన్‌చార్జులు, ఇతర నేతలు ర్యాలీగా ఆటోలు, కార్లలో తరలివచ్చి లోకేశ్‌కు స్వాగతం పలికారు. కాకినాడ కాజాలాగే ఇక్కడి ప్రజల మనసు తీయగా ఉం టుందనడంతో వేలాది మంది చప్పట్లు కొట్టారు. ఎన్నో దివ్యక్షేత్రాలున్న కాకినాడ మీదుగా పాదయాత్ర చేయడం తన అదృష్టమన్నారు. వైసీపీ పాలనలో కాకినాడ రూరల్‌లో అభివృద్ధి నిల్.. అవినీతి ఫుల్ అని ధ్వజమెత్తారు.
ఇక జనసేన పార్టీకి చెందిన లీడర్ ముత్తా శశిదర్..నారా లోకేష్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాకినాడకి యువగళాన్ని చూపించడానికి వచ్చిన నారా లోకేష్‌కి నమస్కారాలు. జనసేన- తెలుగుదేశం కలయిక శుభపరిణామం. ఈ రెండు అధికారంలోకి రావడం ఖాయం.ప్రజలు సుపరిపాలన, రక్షణ, భద్రత కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జనసేన- తెలుగుదేశం ఒక్కటే సుపరిపాలన ఇస్తుందని నమ్ముతున్నారు. వారు కోరుకుంటున్న శాంతి భద్రతలు చంద్రబాబు వల్లే వస్తాయని ప్రజలు కోరుకుంటున్నారు. కష్టం వస్తే వాలిపోయే పవన్‌ని ప్రజలు కోరుకుంటున్నారు. 2024లో జనసేన- తెలుగుదేశం ప్రభంజనం మోగించడం ఖాయం అంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక కాకినాడ యువతకి ఉద్యోగాలు, అలానే హౌజింగ్ రావాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు శశిదర్.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…