Ex Minister KTR : తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ.. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారని చెప్పారు.పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. 119 స్థానాలకు గానూ ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆదేశించారు.
ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఎంత విశ్వాసనీయతతో సేవలందించామో అదే విధంగా పనిచేస్తామన్నారు. ఎదురుదెబ్బను ఒక గుణపాఠంగా తీసుకుని.. పాఠాలు నేర్చుకుంటామన్నారు. ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు.. పల్లాలు చూశామన్నారు కేటీఆర్. అనుకున్న లక్ష్యం తెలంగాణ సాధించామన్నారు. ప్రజల దయతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టామన్నారు. చేసిన అభివృద్ధి పట్ల సంతృప్తి ఉందని తెలిపారు. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపర్చినా.. బాధలేదన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమని అన్నారు కేటీఆర్. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇది వేవ్ అయితేనేమో రాష్ట్రమంతా ఒకేలా ఉండేది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. మెదక్ జిల్లాలో దాదాపు ఏకపక్షంగా ఉంది. కరీంనగర్‌లో 40-60శాతంగా ఉన్నది. ఇది వేవ్‌లా లేదు. సేమ్ టైమ్ అర్థం కాకుండా ఉంది.
మా నాయకులు, అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత వారి అనుభవాలను కూడా తెలుసుకుంటాం’ అని కేటీఆర్ చెప్పారు. ‘పెద్దపల్లి పార్లమెంట్‌లో చెన్నూరులో బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి మంత్రులుగా చేసినవారు లేరు. సింగరేణికి మేం చేసినంత మేలు ఎవరూ చేయలేదు. సింగరేణిని ప్రైవేటీకరణ అడ్డుకోవడం.. కార్మికులకు బోనస్ ఇచ్చాం. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం, వారసత్వ ఉద్యోగాలనే పెండింగ్ సమస్యను పరిష్కరించాం. కానీ, ఇవాళ అక్కడ చూస్తే అక్కడ సాధారణ మెజారిటీ వచ్చింది. ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది’ అన్నారు కేటీఆర్. రాజీకాయాల్లో హుందా తనం, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు అది నేర్పించాడు. మా నాయకుడు ఏం అంటడంటే.. గెలవంగానే పొంగిపోవద్దు.. ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా నాయకులు, కార్యకర్తలకు చెప్పేది అదే’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…