న‌వ్వులు పంచే క‌మెడియ‌న్ జీవితంలో ఇన్ని విషాదాలా.. ఆ విష‌యం చెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం..

జ‌బర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించ‌క‌పోవ‌డంతో మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించి సంద‌డి చేసేవారు. అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్ర‌మంలో బాగానే సంపాదించాడు. అంతేకాదు శాంతి స్వరూప్ ఇటీవ‌ల ఓ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అయితే ఇన్నాళ్లు త‌న‌కు ఎన్ని క‌ష్టాలు ఉన్నా కూడా మ‌న‌కు న‌వ్వుతూ పంచిన శాంతి స్వరూప్ త‌న‌కు సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకొని అంద‌రి కంట క‌న్నీరు పెట్టించాడు.

సుమ యాంకర్ గా చేస్తున్న `క్యాష్‌` ప్రోగ్రామ్‌కి `జబర్దస్త్`లో లేడీ గెటప్‌లతో పాపుల్‌ అయిన శాంతి స్వరూప్‌, మోహన్‌, హరిత, సాయిలేఖ వ‌చ్చారు. వీరు తమ మదర్‌, పాదర్‌లతో కలిసి సందడి చేశారు. అనంతరం ఓ సంద‌ర్భంలో.. శాంతి స్వరూప్ జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి బాధలు పడ్డారో వెల్లడించారు. తమ ఫ్యామిలీ ఎలాంటి ధీన స్థితి లో ఉండేదో చెప్పుకొచ్చాడు. త‌న త‌ల్లి స‌రోజ‌మ‌న్మ తాము చిన్నప్పుడు అమ్మ ఇంటింటికి తిరిగి పాచిపనులు చేసేదని పేర్కొన్నారు. అంట్లూ తోమి తమని పోషించందన్నాడు. అంతేకాదు ఆ సమయంలో తాము ఆకలి బాధలను అనుభవించినట్టు చెప్పాడు.

jabardasth shanthi swaroop got emotional while telling his story

`అమ్మ చాల ఇళ్లల్లో పాచి పనులు, ఆంట్లు తోమేది. అప్పుడు మాకు ఆకలి బాధ ఎలా ఉండేదంటే? అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అమ్మకి గొంతు సరిగా లేదని, ఆమె సరిగా మాట్లాడలేదని తెలిపాడు. ఏదో మాట్లాడాలనుకుంటుంది. కానీ మాట్లాడలేదు అంటూ త‌న త‌ల్లి గురించి చెబుతూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక తన కొడుకే తనని బతికిస్తున్నాడని, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాడని చెబుతూ ఆమె కూడా బోరున విలపించింది. తాజాగా విడుద‌లైన ప్రోమో అంద‌రిని క‌దిలిచింది. శాంతి స్వ‌రూప్ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా ప్ర‌తి ఒక్క‌రు భావోద్వేగానికి గుర‌వుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago