Jabardasth Rakesh : జబర్ధస్త్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న కమెడీయన్స్‌లో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. మొదట్లో ఆయన పలు టీంలలో పర్‌ఫార్మెన్స్ ఇవ్వగా, అనంతరం కామెడీ పంచులు, డైలాగులతో టీం లీడర్‌గా ఎదిగిపోయాడు. ఇక జోర్దార్ సుజాతతో కలిసిన తర్వాత రాకేశ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. జబర్దస్త్ వేదికపై ఈ జోడీకి ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిని జబర్ధస్త్ షో కలపగా త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నారు. అయితే రాకింగ్ రాకేష్ తాజాగా కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుతెచ్చుకుని ఎమోషనల్ అయ్యాడు.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వరంగల్ వదిలి హైదరాబాద్ కి రాగా, దాదాపు . 11 ఏళ్ల పాటు ఎన్నో ఆఫీసులు తిరిగాను. ప్రారంభంలో కొన్ని మిమిక్రీ ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు చేసుకునేవాడిని. ఈవెంట్లు పూర్తయ్యాక పేమెంట్ ఇచ్చేదాకా వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాళ్లం. కొందరు అయితే సరిగ్గా చేయలేదంటూ రూ.500 ఇచ్చినా అదే మహాభాగ్యమని సరిపెట్టుకునేవాడిని. ధనరాజ్ అన్న నన్ను కామెడీ షోకి తీసుకెళ్లడంతో నా లైఫ్ టర్న్ తీసుకుంది. ఆయన వల్లే నేనిప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను. ‘ప్రస్తుతం రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు నాకు తగిన గుర్తింపు, డబ్బు ఉంది కానీ ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. ఒక్కోసారి అమ్మ పస్తులుండి మాకు అన్నం పెట్టేది.
జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని, వాటన్నింటిని దాటుకుని ఇక్కడిదాకా వచ్చాను. అప్పుడప్పుడూ నేను శ్మశానానికి వెళ్లి అక్కడే పడుకుంటాను. ఎందుకంటే అక్కడే నాకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది అంటూ రాకింగ్ రాకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తన ప్రేయసి సుజాత విషయానికొస్తే.. పెళ్లంటే నాకు అసలు మంచి అభిప్రాయమే లేదు. అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతానని అమ్మ బెదిరించింది. ఎప్పుడైతే సుజాత పరిచయమైందో అప్పుడు నా అభిప్రాయం మారింది. ముందుగా ఆమే నన్ను ఇష్టపడింది. మా ఫ్యామీలీకి కూడా బాగా నచ్చడంతో ఆమెను చేసుకునేందుకు సిద్దమయ్యాను అని రాకింగ్ రాకేష్ స్పష్టం చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…