బుల్లితెర ప్రేక్షకులకి కడుపుబ్బ వినోదం పంచుతున్న షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తొమ్మిదేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ కార్యక్రమం మంచి టీఆర్పీస్ దక్కించుకుంటుంది. ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో జబర్ధస్త్ ప్రసారం అవుతోంది. ఇక ఈ షోకి కమెడీయన్స్ కామెడీతో పాటు అనసూయ, రష్మీల గ్లామర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వీరు సరికొత్త అందాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. ఇక, ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ కెరీర్ ఎదుగుదలకు కూడా జబర్ధస్త్ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక ఈ షోలో కామెడీ డోసును పెంచేందుకు టీమ్ లీడర్లు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే సమయంలో షో నిర్వహకులు కూడా కొన్ని హంగులను జోడిస్తూ ప్రేక్షకులకు మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో షో మరింత సక్సెస్ అవుతోంది.
ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతూ వచ్చింది. కానీ ఈ అమ్మడు ఇటీవల ఈ షోకు గుడ్‌బై చెప్పేసింది. దీంతో అనసూయ స్థానంలో రష్మీ వచ్చి చేరింది. జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ రెండు కూడా రష్మీనే చేస్తుంది. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ నుండి రష్మీ జబర్దస్త్ లో కనిపించదు. ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రమే పరిమితం అవుతుంది. దానికి కారణం కొత్త యాంకర్ వచ్చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో ద్వారా నయా యాంకర్ ని పరిచయం చేశారు. ఆ యాంకర్ పేరు సౌమ్య రావు. త్త యాంకర్ కి జడ్జెస్ట్, కమెడియన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందంతో పాటు పంచ్‌లతో కూడా అదరగొట్టింది. నువ్వు యాంకరా? అని హైపర్ ఆది ఆమెని అనగా.. నువ్వు కమెడియన్ అయినప్పుడు నేను యాంకర్ కాదా అని పంచ్ వేసింది. మరి కొత్త యాంకర్ ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…