IND Vs NZ 2022 : వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన కనబరచిన ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ పై గెలిచి తమ సత్తా చాటాలని అనుకుంటుంది. అయితే టీ20ల నుంచి సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి.. వన్డేలపై ఎక్కువ ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తోంది. అయితే న్యూజిలాండ్ టూర్‌కు కొంతమంది సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది. కివీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ టూర్ కోసం భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ చేరుకున్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 టీమ్ బాధ్యతలు చేపట్టాడు.
రోహిత్ శర్మతోపాటు, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి ఈ టోర్నీకి విశ్రాంతినిచ్చింది. దీంతో వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుండగా, టీ20లకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండబోతున్నారు. రెండు సిరీస్‌లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. అయితే ఈ సారి న్యూజిలాండ్ ఇండియా సిరీస్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీని ద్వారా క్రికెట్ అభిమానులని కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వైపు దృష్టి మరల్చేలా చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రకటనలతో ఈ సిరీస్‌పై ఆసక్తి కనబరిచే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఓ యాడ్ వైరల్ అవుతుండగా, ఇది కాస్త వెరైటీగా ఉంది. భారతదేశానికి చెందిన మహిళ న్యూజిలాండ్‌కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అయితే భారత్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా బెడ్ రూమ్ నుండి బయటకు నెట్టేస్తుంది. 2019లో ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది, ఆపై 2021లో, మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. ఈ క్రమంలో ప్రకటనలో మహిళ మాట్లాడుతూ…, “కుచ్ బద్లేగా క్యా?” అని అడుగుతుంది. (ఏదైనా మారుతుందా?). అంటే మహిళ తన భర్తను పడకగది నుండి బయటకు పంపకూడదంటే భారత్ గెలవాలని కోరుకుంటున్నట్లుగా ప్రకటన కాస్త సృజనాత్మకంగా ఉంది కాని ఇది కొంత భారత టీంని కించపరిసేలా ఉన్నట్టుగా ఉందని అనిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…