Ileana : ఇలియానా.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 16 యేళ్లు అవుతున్న ఇప్పటికీ అదే ఫిగర్ మెయింటెన్ చేస్తూ రచ్చ చేస్తోంది. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గోవా ముద్దుగుమ్మకి ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు.తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది.
స్టార్ హీరోల అందరి సరసన నటించిన సత్తా చాటిన ఈ భామకి హిందీలోను చాలానే అవకాశాలు వచ్చాయి.. ఇటు తెలుగులో నటిస్తూనే.. హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా నానా రచ్చ చేసింది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో .. అప్పట్లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఇలియానా ఫిజిక్ చూసి అందరు అవాక్కయ్యారు. దాంతో ఇలియానా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఇలియానాల సన్నజాజీలా తయారై.. నాజూగ్గా రెడీ అయింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో, టాలీవుడ్ లో కూడా అవకాశాలు కూడా ఎక్కువ రావడం లేదు. ఇలాంటి తరుణంలో తన కెరీర్ కోసం ఇలియానా ఫేమస్ సింగర్ సాయం తీసుకుంటోంది. మ్యూజిక్ వీడియోలు రూపొందించే గోల్డకార్ట్జ్ ద్వయం మంజిత్ సింగ్, సుఖ్ జీత్ సింగ్ రూపొందించే సాంగ్ లో ఇలియానా తన అందాలు ఒలకబోయనుంది. సబ్ గజాబ్ అనే సాంగ్ టైటిల్ రివీల్ చేస్తూ ఇలియానా లుక్ ని కూడా విడుదల చేయగా, ఇందులో ఇలియనా లుక్ మతి పోగొట్టేలా ఉంది.. ఈ పిక్ లో ఇలియానా సొగసుకి నెటిజన్లు మైమరచిపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…