Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికే ఎక్కువగా గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయస్సు వారు సైతం హార్ట్ ఎటాక్ లకు గురవుతున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది చాప కింద నీరులా విస్తరిస్తుంది. కనుక దీన్ని వచ్చే ముందే గుర్తించాలి. అప్పుడు ప్రాణాలు పోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక హార్ట్ ఎటాక్ బారిన పడే వారికి ముందుగానే పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
సాధారణంగా అజీర్ణం, గ్యాస్ వచ్చినప్పుడు పొట్ట పై భాగంలో బరువుగా ఉంటుంది. పట్టేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇలా కాకుండా ఛాతిపై అదిమిపట్టినట్లు బలంగా ఒత్తిడి ఉంటే గనక మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని అనుమానించాలి. ఛాతిపై బరువు పెట్టినట్లు ఉంటే అప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఈ రెండు లక్షణాలు ఉంటే అది తప్పనిసరిగా హార్ట్ ఎటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ లక్షణాలు ఉన్నవారు అజాగ్రత్తగా ఉండరాదు. తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
ఇక వేడి వాతావరణంలో లేదా తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంటే మనకు సహజంగానే ఎక్కువగా చెమటలు పడతాయి. కానీ అలా కాకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా సరే.. కొందరికి విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇది హార్ట్ ఎటాక్ వస్తుందని చెప్పడానికి ఒక సంకేతం. కనుక ఇలా ఎవరిలో అయినా ఉంటే.. వెంటనే జాగ్రత్త పడాలి.
అలాగే ఎడమ వైపు దవడ లేదా ఎడమ భుజం తరచూ నొప్పిగా ఉంటున్నా.. కాసేపు నడిచినా తీవ్రంగా అలసి పోతున్నా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా.. వెంటనే అనుమానించాలి. వాస్తవానికి ఇవన్నీ హార్ట్ ఎటాక్ వస్తుందని చెప్పేందుకు సంకేతాలు. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే ముందుగానే జాగ్రత్త పడిన వారం అవుతాము. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…