ICC World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో క్రమంగా ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. ఏ జట్లు సెమీస్‌కు చేరుతాయనే లెక్కలు ఊపందుకున్నాయి. కొన్ని జట్లు సెమీస్ రేసులో ముందుకు దూసుకుపోతుండగా… మరికొన్ని జట్లు మాత్రం చాలా వెనకపడ్డాయి. ప్రపంచకప్ ఆరంభంలోనే సెమీస్ బెర్తుల విషయమై వేడి రాజుకుంది. చివరికి ఎవరు ఆ నాలుగు బెర్తులను దక్కించుకుంటారో అన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. రేసులో ముందున్న జట్లకు కూడా ఎదురుదెబ్బలు తగిలితే మళ్లీ సెమీస్ రేసు సంక్లిష్టంగా మారనుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ దిశగా దూసుకుపోతున్నాయి. మరోవైపు అంచనాలను తలకిందులు చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, అయిదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, దాయాది పాకిస్థాన్ సెమీస్ పోరులో కాస్త వెనకపడ్డాయి.
టోర్నీలో ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచులు గెలిచి ఊపు మీదున్న టీమిండియా, న్యూజిలాండ్ సెమీస్ చేరే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. రెండు మ్యాచుల్లో గెలిచిన దక్షిణాఫ్రికాకు ఆశలు ఉన్నాయి. ఈజట్లు మిగిలిన మ్యాచుల్లోనూ ఇలాగే రాణిస్తే సెమీస్ చేరడం కష్టం కాకపోవచ్చు. కానీ సెమీస్ చేరే ఆ మిగిలిన జట్టు ఏదా అన్న ప్రశ్న ఎదురవుతుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ చేరితే నాలుగో స్థానం కోసం పోటీ తీవ్రమవుతుంది. అది దక్షిణాఫ్రికా మాత్రమే. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా టీమిండియా పెద్దగా నష్టపోవకపోవచ్చు. లీగ్ దశలో ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో నెగ్గినా భారత్ సెమీ ఫైనల్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి.
ప్రస్తుత సిట్యేయేషన్‌లో ఇండియా, న్యూజిలాండ్ ,సౌత్ ఆఫ్రికా మాత్రమే సెమీస్ బర్త్ కన్ ఫామ్ చేసుకునేలా కనిపిస్తున్నాయి.ఇక వాళ్ళ ఆట తీరు కూడా బాగుంది ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్ల ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో వాళ్ళు వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే మరో మూడు రోజులు మ్యాచ్‌ల పరిస్థితి చూస్తే నాలుగో టీంగా ఎవరు వస్తారా అన్నది అందరిలో నెలకొంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…