Prakash Raj : టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా జాతీయ అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు ఎంతో సందడి చేశాయి. వాటిలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్, సుకుమార్, రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ తదితరులు జాతీయ పురస్కారం అందుకున్న వేళ తెలుగు కళామతల్లి మురిసిపోయింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కష్టం గురించి ప్రకాశ్ రాజ్ అభినందించారు. అల్లు అర్జున్ ను జాతీయ అవార్డు వస్తే..అలాంటి హీరోను సన్మానించటానికి అవకాశం దక్కటం లేదా అని నిలదీసారు.
జాతీయ స్థాయిలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని పెంచడంతో ఆ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదని నిలదీసారు. బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణమని చెప్పారు. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిదని చెప్పుకొచ్చారు. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్ బన్నీని ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లమంటే.. తాను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు తనకు గుర్తున్నాయన్నారు. తరువాత గంగోత్రి చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో ‘దిస్ బోయ్ విల్ గ్రో’ అన్నానని గుర్తు చేసుకున్నారు. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాననని.. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచారని ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు.
నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చిందని వ్యాఖ్యానించారు. బన్నీకి జాతీయ అవార్డు వస్తే తన బిడ్డకి వచ్చినట్టు భావిసున్నానని చెప్పారు. తనకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలుగు వారికి రావడం చాలా గర్వంగా ఉందన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…