CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన ఐఏఎస్ ఆమ్ర‌పాలి.. ఎలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారో చూడండి..!

CM Revanth Reddy : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప‌లువురు ప్ర‌ముఖులు నుండి శుభాకాంక్ష‌లు ద‌క్కుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారామె. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడే డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు.

డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్టు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె వివిధ హోదాల్లో పనిచేయ‌డం మ‌నం చూశాం. ఆమ్ర‌పాలి 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ ఆమె పనిచేశారు. తాను పనిచేసిన వివిధ హోదాల్లో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా నుంచి పెళ్లికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త దంపతులను ఆశీర్వదించారు.

IAS Amrapali met CM Revanth Reddy and wished him
CM Revanth Reddy

ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మన రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దన్నారు. ఇక నుంచి ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago