Nara Devansh : కొడుకు అంటే లోకేష్‌కి ఎంత ప్రేమ‌.. అంద‌రి ముందే అలా చేశాడేంటి..!

Nara Devansh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తండ్రి లోకేశ్‌తో కలిసి దేవాన్ష్ పరుగులు పెడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.219వ రోజు ఆదివారం 16.3 కి.మీ నడిచారు.. సోమవారం పాదయాత్ర ప్రారంభించి.. తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు దగ్గర 3వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న పైలాన్‌ను ఆవిష్కరించారు.

పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే కొడుకుతో నారా లోకేష్ చేసిన సంద‌డి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కొడుకు చేసే తుంట‌రి చేష్ట‌ల‌ని ఆస్వాదిస్తూనే మ‌రోవైపు కొడుకుకి ప‌లు సూచ‌న‌లు చేశారు. దేవాన్ష్‌తో లోకేష్ చేసిన సంద‌డికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి.

Nara Devansh fun with his father nara lokesh
Nara Devansh

ఎప్పుడో ఓసారి బయట కనిపించే మోక్షజ్ఞ.. ఇవాళ యువగళం పాదయాత్రలో కనిపించారు.తన అక్కా బావ బ్రాహ్మణి, లోకేష్‌తో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా? అని నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మంచి పవర్ ఫుల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నారు. త్వరలోనే వారి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి మోక్షజ్ఞ.. ఫిట్‌గా కనిపించారు. తన బావ లోకేష్ చేతిలో చెయ్యి వేసి.. కుటుంబ సమేతంగా ముందుకు కదిలారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago