Chiranjeevi : కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ తన ఫాం హౌజ్‌లో కాలు జారి పడడంతో ఆయన తుంటికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కేసీఆర్‌ని రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ నుంచి పరామర్శల వెళ్లువ కొనసాగుతూనే ఉన్నది. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కేసీఆర్ చాలా హెల్తీగా ఉన్నారని త్వరలోనే దైనందిన జీవితంలోకి వస్తారంటూ తెలిపారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే నడిపించిన డాక్టర్ల కృషి అభినందనీమయమన్నారు. కేసీఆర్ సినీ ఇండస్ట్రీ గురించి కూడా అడిగారని అంతా బావుందని చెప్పానన్నారు. డాక్టర్లు 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు. సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు. కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. తనను సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు చెప్పారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? ఇండస్ట్రీ ఎలా ఉంది? అని కేసీఆర్ అడిగినట్లు చెప్పారు. ఇక ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ భుజాలపై మెగాస్టార్ చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. ఎదురుగా కనిపించిన కవితకు నమస్కరించారు. కేటీఆర్ ఆయనను లోపలి తీసుకువెళ్లారు.
రెండు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో కిందపడడంతో గాయపడ్డ కేసీఆర్‌ను వెంటనే సోమాజిగూడ యశోదా దవాఖానకు తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు తుంటి ఎముక ఫ్యాక్చర్ అయిందని తెలిపి అదే రోజు రిప్లేస్‌మెంట్ సర్జరీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆదివారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు కేసీఆర్‌ను పరామర్శించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…