Hyper Aadi : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ ఎంతో ఆసక్తికరంగా మారుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుండగా.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీతో పొత్తుకి సిద్ధమయ్యారు. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ ప్రధాన పోటీదారుడిగా కాకుండా.. కేవలం మద్దతుదారుడిగానే మిగిలిపోనున్నారు . ఇదిలా ఉంటే.. జనసేన-టీడీపీ సీట్ల పంపకాల వ్యవహారం రెండు పార్టీల్లోనూ హీట్ పెంచుతున్న నేపథ్యంలో జనసైనికుడు.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. అసెంబ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధం అని చెప్పకనే చెప్పేశారు. ఈ సందర్భంలో మంత్రి రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైపర్ ఆది.
పాలిటిక్స్ వేరు.. ప్రొఫెషన్ వేరు.. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ వల్లే. నాగబాబుగారితో పాటు రోజా గారూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. రోజా గారు జబర్దస్త్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ పాలిటిక్స్ గురించి చర్చించేవారు కాదు. జబర్దస్త్ సెట్‌లో ఆమె అందరితో చాలా బాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. జబర్దస్త్ కమెడియన్లు ఇంత ఎదిగారంటే ఆమె పాత్ర చాలా ఉంది. నాగబాబు గారు ఏవిధంగా ఎంకరేజ్ చేశారో.. రోజా గారు కూడా ఎంకరేజ్ చేసేవారు. పాలిటిక్స్‌కి వచ్చేసరికి సెపరేట్. నేను అభిమానించేవాళ్లు నాకు ఉంటారు.. మేడమ్ గారు అభిమానించేవాళ్లు వేరే వాళ్లు ఉంటారు. రాజకీయం వేరు.. జబర్దస్త్ వేరు. రోజా గారితో పర్సనల్‌గా ఇష్యూస్ ఏం లేవు.
ఆమె ఇప్పటికీ నాతో బాగానే ఉండేవారు. లేడీ జడ్జీలలో రోజా గారు టాప్. ఆ సీటుకి ఆమె పర్ఫెక్ట్. నేను కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో సపోర్ట్‌గా ఉన్నాను. నా పాలిటిక్స్ ఇప్పుడనే కాదు.. 2013 నుంచి ఆయనకి సపోర్ట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు నాకు ఇష్టం. అందుకే ఆయనతో ఉన్నా.నేను పదవుల్ని.. ఎమ్మెల్యే టికెట్‌లను ఆశించి నేను జనసేనకి పనిచేయడం లేదు. పవన్ గారంటే నాకు ఇష్టం.. ఆయన గెలవాలని కోరుకుంటాను. ఆయన చెప్పింది చేయాలని అనుకుంటాను తప్పితే.. ఆయన నుంచి ఏదీ ఆశించను. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా. నేను గెలవాలని కాదు.. పవన్ కళ్యాణ్ గారు గెలివాలనే కోరుకుంటున్నా. ఈసారి కూడా జనసేన తరుపున ఎన్నికల క్యాంపెయిన్‌కి వెళ్తా.. ప్రచారం చేస్తా.. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషిచేస్తా అని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…