KTR : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..!

KTR : అసెంబ్లీలో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయ‌కులు ఒకరిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. స‌భలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సభలో అధికార పక్షం నేతలు వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు.. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి నేరుగా మీడియా పాయింట్ వద్దకు వెళ్దామనుకున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా జ‌రుగుతున్న అసెంబ్లీలో కేటీఆర్ కూడా ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

తెలంగాణ మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రులు తమ పార్టీ ఎమ్మెల్యేలను దూషించడానికే అసెంబ్లీకి వచ్చినట్లుందని అన్నారు. భాష కూడా సక్రమంగా లేదని కేటీఆర్ అన్నారు. తాము గెలిచి ఏం చేస్తామో చెప్పకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ప్రత్యర్థి పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ కేటీఆర్ మండి పడ్డారు. ముందు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను, గ్యారంటీలను అమలు చేసి చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అంతే తప్ప అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పై బురద జల్లే విధంగా అసెంబ్లీని నడపటం ప్రజలందరూ చూస్తున్నారన్నారు.

KTR very angry comments on cm revanth reddy
KTR

మేడిగడ్డకు పోయి కూలిపోయిందంటూ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని బాగు చేయాలన్న స్పృహ కూడా లేదని కేటీఆర్ మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టుకున్నది బడ్జెట్ పై చర్చించేందుకు మాత్రమేనని, బీఆర్ఎస్ పై విమర్శలు చేయడానికి కాదన్న విష‍యం గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని చిట్ చేసి నాశనం చేసిన చీడపురుగే రాజగోపాల్ రెడ్డి అని కడియం తీవ్ర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్ సైతం డిమాండ్ చేశారు.మరోవైపు.. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారన్నారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్దమని.. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సభకు వచ్చి చర్చ చేయాలన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago