Harish Rao : ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకు? అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు తమకు మైక్ ఇవ్వడం లేదని… మీడియా పాయింట్ వద్ద సైతం మాట్లాడేందుకూ అవకాశం ఇవ్వరా? అని ప్రశ్నించారు. శాసన సభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్దకు వెళుతుండగా పోలీసులు, మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఇప్పుడు మీడియా పాయింట్ వద్దకు కూడా వెళ్లనీయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు అడ్డం పెట్టడంపై కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. సెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు అణిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు అని మండిపడ్డారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం.. అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనూ… ఇక్కడా… రెండు చోట్ల గొంతు నొక్కుతారా? అని ధ్వజమెత్తారు. ఇక్కడ మూడు నాలుగు వేల మంది పోలీసులను మోహరించారన్నారు. ఇనుప కంచెలను తీసేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని… అలాంటప్పుడు ఇక్కడ ఆంక్షలు ఎందుకో చెప్పాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా? లేక కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…