ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌ గురించి చిరంజీవి ఎలా స్పందించారంటే..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాడో అప్ప‌టి నుండి విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆయ‌న మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తుండ‌గా, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం గురించి అడిగితే నో కామెంట్స్ అంటూ మాట దాటేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తుంటారు దాని పై మీ స్పందన ఏంటి అని ప్రశించగా, చిరంజీవి బదులిచ్చారు.

ఆ విషయంలో నిజానిజాలు ప్రజలకి తెలుసు అని అభిప్రాయపడ్డారు. ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు అది నమ్మాలా, నమ్మకూడదా అనే విచక్షణ ప్రజలకు ఉంటుందన్నారు. వారంతా అలా ఆలోచిస్తారు కాబట్టే ఈరోజు కళ్యాణ్ బాబుకి ఇంతటి ఫాలోయింగ్ ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయినా రాజకీయపరంగా వారు ఏదైనా కామెంట్స్ చేసుకొనివండి. కానీ నేను వాటి గురించి మాట్లాడాను. నేను రాజకీయానికి దూరంగా ఉందాం అనుకుంటున్నా. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నా అని నా తమ్ముడిని దూరం చేసుకోలేను కదా. వాడు నా తమ్ముడు, ఎక్కడవున్నా నా తమ్ముడే. నాకు బిడ్డ లాంటి వాడు” అంటూ బదులిచ్చాడు.

how chiranjeevi reacted on pawan kalyan marriages

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఆరుప‌దుల వ‌య‌స్సులోను వ‌రుస సినిమాలు చేస్తూ సూప‌ర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్టుతో ప్రారంభించాడు చిరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కె బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించాడు. ఈ చిత్రంలో చిరు.. వింటేజ్ లుక్స్, డాన్స్, యాక్షన్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడంతో ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ చూపించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago