Honey Rose : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ కాగా, ఆయన తాజాగా నటించిన చిత్రం. వీర సింహారెడ్డి. ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించిన మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బొద్దుగా అందంగా ఉందంటూ తెలుగు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఈ అమ్మడు వీరసింహారెడ్డి సినిమాకి ముందు పలు సినిమాలలో నటించగా, పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించలేదు. వీరసింహారెడ్డి చిత్రంతో ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోతుంది. బాలకృష్ణ మరోసారి ఈమె తో నటించాలని కోరుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా లో హనీ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి.
మొన్నటి వరకు బొద్దుగా కనిపించిన ఈ భామ స్లిమ్‌గా కనిపించేందుకు కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే హనీరోజ్ ఇటీవల ఎక్కువగా మాల్స్ ఓపెనింగ్‌కి వెళుతుంది. ఇక సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. తాజాగా హనీ రోజ్ హైదరాబాద్ లో జిస్మత్ మండీని ప్రారంభించారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. వీరసింహారెడ్డి మూవీలోని రోల్ కు ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు దక్కాయని ఆమె అన్నారు. బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్ రావడంతో నా కల నిజమైందని చెప్పుకొచ్చింది.
ఇక 14 ఏళ్ల వయస్సులోనే తాను సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పిన హనీరోజ్.. వీరసింహారెడ్డి సినిమా కోసం నాకు కాల్ రావడంతో ఎంతో ఆశ్చర్యపోయినట్టు పేర్కొంది. .నా మీద ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్ కు ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లి అంటే బాధ్యత అని అందుకే ప్రతి అంశంతో ప్రేమలో ఉన్నానంటూ హనీ రోజ్ విచిత్రమైన కామెంట్స్ చేసింది. మలయాళ నటి అయిన హనీ రోజ్ తెలుగులో చేసిన మొదటి చిత్రం ఆలయం కాగా, 2008లో ఈ చిత్రం విడుదలైంది. ఆ సినిమా ఆడకపోవడంతో హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. 2014లో వరుణ్ సందేశ్ కి జంటగా ఈ వర్షం సాక్షిగా అనే చిత్రం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…