Anasuya : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మంచి సినిమాలకి తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ మధ్య బలగం చిత్ర బృందాన్ని అభినందించిన చిరు తాజాగా రంగమార్తాండ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలని కోరారు. రంగమార్తాండ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈచిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్.. ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు.. హాస్యబ్రహ్మానందం కలయిక.. వారి పనితనం.. ఆ ఇద్దరి అద్భుతమైన నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది’’ అని పేర్కొన్నారు. ‘‘బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి పెట్టించింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే చిరంజీవి ట్వీట్‌కి అనసూయ స్పందిస్తూ.. థ్యాంక్యూ చిరు సర్ అని కామెంట్ పెట్టింది. అయితే ఎప్పుడు అనసూయ దొరుకుతుందా ఆమెని ట్రోల్ చేయాలని చూస్తూ ఉండే ఓ వర్గం తాజా ట్వీట్‌పై కూడా స్పందించింది. ‘నిన్ను ట్యాగ్ చేయలేదు కదా ఆంటీ.. నీ ప్రస్తావన ఎక్కడా తీసుకుని రాలేదు.. ఈ షుగర్ ఎందుకు’ అంటూ అనసూయపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే అనసూయ సపోర్టర్స్ మాత్రం చిత్ర బృందం అని మెన్షన్ చేశారు కదా, ఆమె కూడా చిత్రంలో అద్భుతంగా నటించింది కదా అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…