Hit 2 Movie : నటుడిగా టాలీవుడ్ లో అదరగొడుతున్న నాని ఇప్పుడు నిర్మాతగాను మారిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా హిట్ చిత్రంతో అలరించిన హిట్ ఎన్నో రికార్డులని సాధించింది. ఇక హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం హిట్ ది సెకండ్ కేస్. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో ఆయనే తెరకెక్కించిన హిట్ చిత్రానికి సీక్వెల్‌గా దూసుకొచ్చింది. ఇటీవల రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్-2 చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్‍ఫాం భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం.
ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తుండగా, ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు ఈ రైట్స్ దక్కాయి. ఓటీటీలో ఈ సినిమా జనవరి నెలలో విడుదలకు ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తోంది.జనవరి నెల మొదటి వారంలో జనవరి 2, జనవరి 6 కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. హిట్ 2 సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ గా వచ్చాయి. కలెక్షన్స్ వైజ్ గా సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.
తొలి రోజు 6 నుంచి 7 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.1.50 కోట్లు వచ్చాయని టాక్. ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించగా.. శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్, కోమలి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్యారీ బీహెచ్ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…