Hit 2 Movie Review : అడివి శేష్ న‌టించిన హిట్ 2 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Hit 2 Movie Review : యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకోగా, తాజాగా హిట్ 2 చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించారు. అడివి శేష్ హీరో కావడంతో సినిమాకి అనుకూలతలు ఏర్పడ్డాయి. హిట్ 2 ట్రైలర్ అంచనాలు పెంచేయగా.. ఎంత వరకు ఆ అంచనాలు అందుకుందో చూద్దాం.

క‌థ‌..

వైజాగ్ లో సంజన అనే అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతుంది.. ఆమెను ఎవరో దారుణంగా హింసించి చంపేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కృష్ణదేవ్(అడివి శేష్) అలియాస్ కేడి రంగంలోకి దిగుతాడు. ఇలాంటి కేసులు చాలా చూసాను చెప్పుకొచ్చిన ఆయ‌న‌కి ఈ కేసు స‌వాల్‌గా మారుతుంది. మర్డర్ కి గురైంది సంజన మాత్రమే కాదు ఆ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కూడి ఉందని తెలిసి కేడీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఈ సైకో సీరియల్ కిల్లర్ ఎవరు ? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు ? కేసుని కేడీ ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Hit 2 Movie Review know how is the movie
Hit 2 Movie Review

ఇంత‌కు ముందు త‌న ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టిన అడివి శేష్ కేడి రోల్ లో అదరగొట్టారు. ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. హీరోయిన్ పాత్రకు కథ రీత్యా పెద్దగా పరిధి లేదు. మీనాక్షి చౌదరి పర్లేదు అనిపించారు. సాంకేతికంగా చూస్తే బీజీఎం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కి పాస్ మార్క్స్ వేయవచ్చు. హిట్ 2 చిత్రానికి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్..

  • అడివి శేష్ యాక్టింగ్
  • డైరెక్షన్
  • స్క్రీన్ ప్లే
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్..

  • ఫస్ట్ హాఫ్
  • బీజీఎం

సినిమా థ్రిల్ల‌ర్స్‌ని ఇష్ట‌ప‌డే వారికి ఎంత‌గానో నచ్చుతుంది రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చూసేవారికి అంత‌గా నచ్చకపోవచ్చు. స్లోగా మొదలయ్యే హిట్ సెకండ్ హాఫ్ లో పుంజుకొని క్లైమాక్స్ లో మాత్రం అద‌ర‌గొట్టేస్తుంది. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తాయి. సమయానుసారంగా వచ్చే ట్విస్ట్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయి. హిట్ 3 హీరో ఎవరో పరిచయం చేయడం బాగుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago