Laya : స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ లయ. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన లయ వచ్చిన కొత్తలోనే మంచి నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు అందుకుంది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ కు ముగింపు కార్డు పెట్టిన లయ ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ తో తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అయితే లయ ఒకప్పుడు మంచి మంచి సినిమాలే చేసింది. దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
1992లో భద్రం కొడుకో అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వేణు తొట్టెంపూడితో చేసిన స్వయంవరం సినిమాతో మొదటి సక్సెస్ పొందింది. ఇక అక్కడ నుండి దూసుకుంటూ వెళ్లింది. మనసున్న మారాజు, కోదండరాముడు, దేవుళ్ళు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు సినిమాలతో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకుంది. కొండవీటి సింహం, శివరామరాజు, నువ్వు లేక నేను లేను అనే సినిమాలతో కూడా మంచి సక్సెస్ అందుకుంది.
2006లో ఒక కన్నడ సినిమాలో నటించి ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైన లయ అమెరికాలో సెటిల్ అయింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండగా ఆమె ఇటీవల సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. డ్యాన్స్ వీడియోలతోపాటు ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని సంతోషపరుస్తుంది. రీసెంట్ గా లయ తన కూతురు శ్లోకకు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా లయ తన కూతురిని రెడీ చేసిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రానున్న రోజులలో శ్లోక కూడా తెలుగు హీరోయిన్‌గా మారడం ఖాయం అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…